![]() |
![]() |
.webp)
బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ పడాలా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూకి వచ్చాడు. హోస్ట్ వర్ష చాలా ప్రశ్నలే అడిగింది. బిగ్ బాస్ హౌస్ లో రిలేషన్స్ మీద అడిగేసరికి "100 రోజులు ఎవరూ నటించలేరు. ఎంత పెద్ద నటుడైనా సరే . హౌస్ లో నాకు ఇష్టమైన అమ్మాయి తనూజ. హౌస్ నుంచి బయటకు వచ్చేటప్పుడు ఒక ఇష్యూ అయ్యింది ఆ సెటిల్మెంట్ నుంచి 24 గంటల్లో నన్ను బయటపడేసింది. ఇప్పటికి బయటకు వెళ్తే జాగ్రత్తగా వెళ్ళు అని వార్నింగ్ ఇస్తుంది .
ఇక ఇమ్ము నా అన్న లాంటి వాడే. రియాలిటీ ఏంటో చెప్తాడు. బిగ్ బాస్ అగ్నిపరీక్ష టైములో నవదీప్, బిందు మాదవి, అభిజిత్, శ్రీముఖి అక్క నాకు బాగా సపోర్ట్ చేశారు. బిగ్ బాస్ అగ్నిపరీక్షకు రావాలంటే అసలు వాళ్లేంటి అనేది వీడియోస్ చేసి పంపించాలి. సోషల్ మీడియా అంటే నాకు పెద్దగా రాదు ఇష్టం ఉండదు. నేను కాఫీ తాగుతున్నా అని పెట్టగలను కానీ అక్కడికి వెళ్లి తాగుతున్నా ఇక్కడికి వెళ్లి తాగుతున్న అని పెట్టలేను. ఇష్టం ఉండదు. నాకు డబ్బు ఆనందాన్ని ఇవ్వదు.
నేను వెయ్యి రూపాయల కోసం ఏడ్చినా రోజులున్నాయి. ఇప్పుడు డబ్బు వెనక పరిగెట్టినోళ్లంతా ఆఫ్టర్ 50 స్ రిలీజ్ అవుతారు. మా అమ్మ ఇంట్రావర్ట్ హౌస్ లోకి మా నానమ్మ వస్తుంది అనుకున్న కానీ అమ్మ రావడం ఆమెకు తనూజ చీర పెట్టడం అంతా షాకింగ్ గా అనిపించింది. " అంటూ చాలా విషయాలు చెప్పాడు.
![]() |
![]() |